
తమిళ సినీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తాజా సినిమా కూలీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న లోకేష్.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు.
కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన లోకేష్, కూలీ ప్రమోషన్ కోసం తిరిగి వచ్చాడు. తన జీవిత ప్రయాణంలో మైల్‌స్టోన్ అయిన కాలేజీ గురించి గుర్తుచేసుకున్నాడు.
తాజాగా, చదువుకున్న కాలేజీ రూమ్‌లో కూర్చుని సెల్ఫీ తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ‘‘అంతా ఇక్కడినుంచే మొదలైంది’’ అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్, లోకేష్ కనగరాజ్ పుట్టినదే సినిమా పైనే అన్నట్టుగా స్పందిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే లోకేష్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం లోకేష్ షేర్ చేసిన ఫోటో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.