Sunday, October 4, 2026
HomeAndhra Pradesh‘లిక్కర్ కేసు’లో కొత్త బాంబు - డబ్బు చివరికి ఎవరికి చేరింది?

‘లిక్కర్ కేసు’లో కొత్త బాంబు – డబ్బు చివరికి ఎవరికి చేరింది?

liquor-scam-money-trail-and-final-beneficiary-revealed

న్యూస్ డెస్క్: వైసీపీ పాలనలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే సమర్పించిన చార్జిషీట్‌కు అదనంగా, తాజా అనుబంధ చార్జిషీట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు.

ఈ కొత్త చార్జిషీట్‌లో, నగదు మూలం నుంచి చివరి లబ్ధిదారు వరకు వెళ్లిన మార్గాన్ని సిట్ స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ లబ్ధిదారు ఎవరో మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.

దీనిలో భారతీ సిమెంట్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ విజయవాడ జైలులో ఉన్నారు. వీరి ద్వారా డబ్బు వివిధ మార్గాల్లో తరలించబడిందని సిట్ పేర్కొంది.

ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో వీరి అనుబంధం, దుబాయ్, హైదరాబాద్, పుంగనూరు వంటి ప్రదేశాల్లో జరిగిన సమావేశాల వివరాలను కూడా చార్జిషీట్‌లో చేర్చారు. ఈ చర్చల్లో ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని, డిస్టిలరీలకు టార్గెట్లు విధించినట్టు సిట్ పేర్కొంది.

డబ్బు భాగస్వామ్యం తర్వాత, ఆ సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా వెళ్ళిందీ కూడా రికార్డు చేశారు. ఇందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, సినిమా నిర్మాణాలు ఉన్నాయని వెల్లడించారు.

మిగిలిన పెట్టుబడుల వివరాలు, విదేశీ లావాదేవీలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కేసు మలుపులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular