
న్యూస్ డెస్క్: వీక్ పాస్ వర్డ్ వల్ల ఒక్కసారిగా 158 ఏళ్లపాటు విజయవంతంగా నడిచిన కంపెనీ మూత పడనుంది. యూకేలో ప్రసిద్ధి చెందిన ‘కెఎన్‌పీ లాజిస్టిక్స్’ సంస్థ సైబర్ అటాక్‌కు బలై, ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. సైబర్ నేరగాళ్లు కంపెనీ సిస్టమ్‌లోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని నియంత్రణలోకి తీసుకున్నారు.
పాస్ వర్డ్ బలహీనంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగుల్లో ఒకరి పాస్ వర్డ్‌ను సులభంగా ఊహించిన హ్యాకర్లు సిస్టమ్‌లోకి ప్రవేశించారు. దీంతో సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని బ్లాక్ చేసి, సంస్థను పూర్తిగా స్తంభింపజేశారు.
హ్యాకర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేశారు. అటువంటి మొత్తం చెల్లించే పరిస్థితి సంస్థకు లేకపోవడంతో, కంపెనీని మూసివేయాలని నిర్ణయించారు. ఈ ఘటనతో 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
సైబర్ నిపుణుల అంచనాల ప్రకారం, అకీరా అనే హ్యాకింగ్ గ్యాంగ్ ఈ అటాక్‌కి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. సురక్షితమైన పాస్ వర్డ్ లేకపోవడం కంపెనీకి భారీగా భారం మోపింది.