fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsకిరణ్ అబ్బవరం కొత్త మూవీ అప్‌డేట్: ‘K ర్యాంప్’ షురూ!

కిరణ్ అబ్బవరం కొత్త మూవీ అప్‌డేట్: ‘K ర్యాంప్’ షురూ!

kiran-abbavaram-ka-ramp-shooting-update

టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో యూత్ ని ఆకట్టుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం, రీసెంట్‌గా “దిల్ రూబా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం మాత్రం “క”, దాంతో అతను తన మార్క్ ర్యాంపేజ్ చూపించాడు.

తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కిరణ్ అబ్బవరం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. “K ర్యాంప్” అనే కొత్త సినిమాకు షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు చెబుతూ, మళయాళంలో ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్ పిక్‌ని షేర్ చేశాడు. “ఫన్ ఇప్పుడే మొదలైంది” అంటూ ఇచ్చిన క్యాప్షన్‌కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా యుక్తి తరేజా నటించబోతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు రాజేష్ దండ చేపట్టాడు.

కిరణ్ ఇప్పటికే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు, ఈ ప్రాజెక్ట్‌తో తన సక్సెస్ జోరు కొనసాగిస్తాడో చూడాలి. మేకర్స్ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular