
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “కింగ్డమ్”కు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, మే 30న గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే ఇప్పుడు ఈ రిలీజ్‌పై కొత్తగా డౌట్స్ మొదలయ్యాయి. సినిమా జూలైకి వాయిదా పడినట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం మే 30 రిలీజ్‌పై ఇంకా హోప్ పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మ్యూజిక్ సింగిల్స్ సినిమాపై హైప్ పెంచాయి.
విజయ్ దేవరకొండకు “కింగ్డమ్” చాలా కీలకమైన సినిమా. పాన్-ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకోవాలని చేస్తున్న ఈ ప్రాజెక్ట్, రిలీజ్ వాయిదా వార్తలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ సస్పెన్స్ కి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి!