
విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలకంగా మారిన చిత్రం “కింగ్ డమ్“. గత సినిమాల ఫలితాల అనంతరం ఈ మూవీపై విజయ్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది.
ఈ సినిమా బడ్జెట్ గురించి తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. మొదట్లో చిన్న బడ్జెట్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్, డిలేలు మరియు సాంకేతిక సమస్యల వల్ల భారీగా పెరిగిందని చెప్పారు.
మొత్తంగా బడ్జెట్ రూ.130 కోట్ల వరకు వెళ్లిందని పేర్కొన్నారు. విజయ్ మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చైనా, దర్శకుడిపై నమ్మకంతోనే ఆ రిస్క్ తీసుకున్నట్టు తెలిపారు. కథపై నమ్మకం ఈ నిర్ణయానికి కారణమని చెప్పారు.
డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ తీసుకోవడం, థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేట్లకు అమ్ముడవడం చిత్రానికి బూస్ట్ ఇచ్చాయి. బడ్జెట్ ఎక్కువైనా, కంటెంట్ పట్ల నమ్మకంతో ముందుకెళ్లారట.
ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుందన్నదే కీలకం. అనిరుధ్ సంగీతం ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. విజయ్ కు ఇది కింగ్ సైజ్ హిట్ అవుతుందా అనేది త్వరలో తెలుస్తుంది.