
టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన కేతికా శర్మకు ఇప్పుడు బూస్ట్ దొరికినట్లే. ‘సింగిల్’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కేతికా, మాస్ ఆడియన్స్‌ను గ్లామర్‌తో ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంది.
ఈ చిత్రం రెండో వారంలోనూ రూ.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి, కేతికాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ విజయంతో వెంటనే మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ‘అనార్కలి’లో కేతికా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరో హీరోయిన్ కూడా ఇందులో కనిపించనుంది.
రవితేజ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కేతికాకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అవ్వనుంది. ఇందులో ఆమె స్టైలిష్ అవతార్‌లో కనిపించనుందట. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టిన కేతికా, తన పాత్రపై చాలా ఆసక్తిగా ఉన్నారు.
సక్సెస్ ట్రాక్ ఎక్కిన కేతికా, ఇప్పుడు వరుస అవకాశాలను క్యాచ్ చేసుకునే పంథాలో ఉంది. ‘అనార్కలి’ ఫలితం ఆమె గేమ్‌నే మార్చే అవకాశం ఉంది.
Kethika Sharma, Ravi Teja, Anarkali Movie, Tollywood Heroines, Telugu Cinema,