Sunday, August 23, 2026
HomeSportsషెడ్యూల్ మారినా టికెట్ వాలిడ్‌: ఆర్సీబీ హామీ

షెడ్యూల్ మారినా టికెట్ వాలిడ్‌: ఆర్సీబీ హామీ

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ మారిన నేపథ్యంలో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా లీగ్‌కు వారం పాటు విరామం ప్రకటించగా, మే 17 నుంచి టోర్నీ మళ్లీ ప్రారంభం కానుంది.

మొదట మే 13న జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) vs సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను మే 23కు మారుస్తూ షెడ్యూల్‌ను సవరించారు. దీనిపై ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారు గందరగోళానికి గురయ్యారు. కానీ మంగళవారం ఆర్సీబీ యాజమాన్యం అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, షెడ్యూల్ మారినా మే 13న కొన్న టికెట్లే మే 23న జరిగే మ్యాచ్‌కు వాలిడ్‌గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. టికెట్ రీఫండ్ అవసరం లేదని, ఆ టికెట్‌తోనే అభిమానులు చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది.

ఇది ఆర్సీబీ అభిమానులకు పెద్ద ఊరట. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం కీలకమైన ఈ మ్యాచ్‌కు క్రౌడ్ మద్దతు పెద్ద ప్లస్ కానుంది. మే 17న ఆర్సీబీ vs కోల్‌కతా మ్యాచ్‌తో ఐపీఎల్ మళ్లీ మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 16927968366a8b6ebc43083