
న్యూస్ డెస్క్: ఆసియాలో పేరొందిన హాంకాంగ్‌ను భారీ అగ్నిప్రమాదం కుదిపేసింది. న్యూ టెరిటరీస్‌లోని ఒక హౌసింగ్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు ఏడు టవర్లను మింగేశాయి. ఈ అత్యంత ఘోరమైన దుర్ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించగా, 270 మందికి పైగా ఆచూకీ తెలియకుండాపోయింది.
ఈ స్థాయి అగ్నిప్రమాదం హాంకాంగ్ చరిత్రలో గత 60 ఏళ్లలో సంభవించడం ఇదే తొలిసారి. మరణించిన వారిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు అధికంగా ఉన్నారు. వృద్ధులు రక్షణ చర్యలకు ఆటంకం కలగడం మరణాల సంఖ్య పెరగడానికి కారణమైంది.
ప్రమాదం ప్రారంభమైనది 32 అంతస్తుల భవనం వెలుపల మరమ్మతుల పనుల వద్ద అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వెదురు కట్టడాలు ప్లాస్టిక్ నెట్టింగ్ వంటి మండే స్వభావం గల పదార్థాలు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయి.
ప్రమాద తీవ్రత పెరగడానికి మరొక భయంకరమైన అంశం ఫైర్ అలారమ్‌లు పనిచేయకపోవడం. మరమ్మతుల కారణంగా అలారమ్‌లు నిలిపివేశారు. చాలా మంది నివాసితులు ప్రమాదాన్ని ఆలస్యంగా గ్రహించారు.
ఘటనపై రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు 140 ఫైరింజన్లు 60 అంబులెన్స్‌లను హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఈ ఘటన భద్రతా లోపాలు నిర్లక్ష్యం కారణంగా ఒక ఆధునిక నగరంలోని కట్టడాలు ఎలా భస్మమయ్యాయో తెలిపే ఒక ఘోర ఉదాహరణ. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
