న్యూస్ డెస్క్: రాజస్థాన్‌లో బుధవారం ఒక దుర్ఘటన జరిగింది. చూరు జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శకలాలను పరిశీలించాయి. పైలట్ మృతదేహాన్ని వెలికితీశారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే వాయుసేన ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించారు.