Wednesday, July 16, 2025
HomeMovie Newsబుల్లితెరపై ఛావా.. ఆగస్టు 17న వరల్డ్ టీవీ ప్రీమియర్

బుల్లితెరపై ఛావా.. ఆగస్టు 17న వరల్డ్ టీవీ ప్రీమియర్

chhava-world-tv-premiere-august17

విక్కీ కౌషల్, రష్మిక మందన్న జంటగా నటించిన బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా ఛావా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 17న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కి గొప్ప అవకాశం.

ఈ సందర్భంగా ముంబై బాంద్రాలో ‘రౌండ్ టేబుల్’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో విక్కీ కౌషల్, వినీత్ కుమార్ సింగ్, దివ్య దత్తా, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ పాల్గొన్నారు.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి వ్యూయర్‌షిప్ సాధించింది.

ఇప్పుడు బుల్లితెరపై ఈ చిత్రం ఏ రేంజ్ టీఆర్పీ సాధిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందా? అన్నది ఆగస్టు 17న తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular