
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. జూలై 2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా విశ్రాంతి ఇవ్వాలని ముందుగానే యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి మిగిలిన పేసర్ల నుంచి తగిన మద్దతు అందలేదు. ప్రసిధ్, సిరాజ్ లు అనూహ్యంగా అధిక పరుగులు సమర్పించి విఫలమయ్యారు.
ఈ సిరీస్‌కు ముందు బుమ్రా మూడే టెస్టులు ఆడతాడని బీసీసీఐ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. మూడో టెస్టు జులై 10న లార్డ్స్‌లో ప్రారంభమవుతుండగా, అందులో బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.
బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా నితీశ్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇద్దరికీ టెస్టు అనుభవం లేకపోయినా, టీ20లలో మంచి ఫాంలో ఉన్నారు.
విశ్రాంతిపై రవిశాస్త్రి, గవాస్కర్‌లు వ్యతిరేకంగా స్పందించగా, గౌతమ్ గంభీర్ బుమ్రా పని భారం దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భారత బౌలింగ్‌ను ఎంత ప్రభావితం చేస్తుందో రెండో టెస్టు ఫలితం చెప్పాల్సి ఉంది.
