
స్పోర్ట్స్ డెస్క్: రాబోయే ఆసియా కప్ కోసం టీమిండియా జట్టులో పెద్ద మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు జట్టుకు దూరమయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అద్భుత విజయాలు సాధించింది. 15 టీ20ల్లో 13 గెలుపులు సాధించడంతో ప్రస్తుత జట్టును అలాగే కొనసాగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గిల్ ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్ సిరీస్‌లో 754 పరుగులు చేసి, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అయినా, అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇస్తూ అతనిని పక్కన పెట్టే అవకాశం ఉందని సమాచారం.
యూఏఈ పిచ్‌లకు సరిపడే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల కోసం సెలక్టర్లు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ లాంటి ఆటగాళ్లకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
జట్టులో అనుభవం, పరిస్థితులకనుగుణంగా ఆడగల సామర్థ్యం సెలక్టర్ల ప్రధాన ప్రమాణంగా మారినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో ఉన్నా అనుభవం లేని యువ ఆటగాళ్లకు నిరాశ తప్పదని అంచనా.
మంగళవారం జట్టు అధికారికంగా ప్రకటించనుండటంతో అసలు జాబితా ఎలా ఉంటుందో అన్నదే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
