
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బయట కూడా ఆయన లుక్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ ఓ స్పెషల్ టీ-షర్ట్‌తో కనిపించి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాడు.
ఈ టీ-షర్ట్ ప్రత్యేకత ఏంటంటే… దానిపై బ్రహ్మానందం నటించిన ఓ ఐకానిక్ క్యారెక్టర్ “నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా”కి సంబంధించిన ఫొటోలు ఉండటం. ఈ క్యారెక్టర్ మాస్ మీమర్స్‌లో ఎంతో ఫేమస్. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్‌ను హైలైట్ చేసే టీ-షర్ట్ వేసుకోవడంతో ఫ్యాన్స్ మజా పడుతున్నారు.
ఫోటోలు వైరల్ కావడంతో “బన్నీ బ్రహ్మానందం డై హార్డ్ ఫ్యాన్” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కామెడీ సినిమాలకు బ్రహ్మీ చేసిన కాంట్రిబ్యూషన్‌కు ఇది ఓ గౌరవాన్నే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, బన్నీ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే తన నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కనుండటంతో, బన్నీ ప్రతి మూమెంట్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు అభిమానులు.