
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ “అఖండ 2” షూటింగ్ వేగంగా పూర్తి కావచ్చింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య మరోసారి అఘోర పాత్రలో దర్శనమివ్వబోతున్న నేపథ్యంలో, ఈ సారి ఆయుధం మరో లెవెల్లో ఉండబోతుందని టాక్.
బోయపాటి సినిమాల్లో హీరో వాడే ఆయుధాలకు ప్రత్యేకత ఉంటుంది. లెజెండ్, సింహా, అఖండ చిత్రాల్లో కనిపించిన ఆయుధాలు సినిమాల హైలైట్‌గా నిలిచాయి.
అఖండ 1లో త్రిశూలం ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అఖండ 2 కోసం దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను డిజైన్ చేయిస్తున్నారని సమాచారం.
ఈ స్పెషల్ త్రిశూలం మైథాలజికల్ టచ్‌తో రూపొందించబడుతోందట. శిల్పకళ, ప్రాచీన శైవ సంప్రదాయాలను కలిపి తయారు చేసిన ఈ ఆయుధం బాలయ్య ఆధ్యాత్మిక పవర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై రెడిఫైన్ చేయనుందని యూనిట్ టాక్.