Wednesday, August 27, 2025
HomeAndhra Pradeshచంద్రగ్రహణం.. తిరుమల ఆలయంపై టీటీడీ కొత్త నిర్ణయం

చంద్రగ్రహణం.. తిరుమల ఆలయంపై టీటీడీ కొత్త నిర్ణయం

tirumala-temple-lunar-eclipse-september-7

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరు 7న జరిగే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది. భక్తులు తమ యాత్ర ప్రణాళికను ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సవరించుకోవాలని అధికారులు సూచించారు.

టీటీడీ వివరాల ప్రకారం, సెప్టెంబరు 7న రాత్రి 9:50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సెప్టెంబరు 8న ఉదయం 1:31 గంటలకు ముగుస్తుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయం మూసివేయబడుతుంది.

తిరిగి సెప్టెంబరు 8న ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం ఆలయం తెరవబడుతుంది. శుద్ధి కార్యక్రమాల అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాన్ని అనుమతించనున్నారు.

గ్రహణం కారణంగా సెప్టెంబరు 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి అన్నప్రసాద వితరణ నిలిపివేయబడుతుంది. సెప్టెంబరు 8న ఉదయం 8:30 నుంచి మళ్లీ అన్నప్రసాదం యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 30,000 పులిహోర ప్యాకెట్లను సెప్టెంబరు 7 సాయంత్రం నుంచి పంపిణీ చేయనున్నారు. వీటిని వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద అందుబాటులో ఉంచుతారు.

Tirumala, TTD, Lunar Eclipse, Temple Rules, Devotees,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular