
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, నాలుగో రోజు కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది.
సినిమా 4వ రోజు హిందీ వెర్షన్లోనే ₹25 కోట్లు నెట్ వసూలు చేసింది. దీంతో హిందీ మార్కెట్లో మొత్తం నాలుగు రోజులకు ₹123 కోట్లు నెట్ సంపాదించింది. ఇది బాలీవుడ్లో ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాలతో పోలిస్తే అత్యుత్తమ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా అదే జోష్ కొనసాగిస్తోంది. ఆగస్ట్ 15 సెలవుదినం వసూళ్లలో కీలకంగా మారింది. హిందీ నెట్లో ఏకంగా 55% జంప్ రావడం సినిమా హైప్‌ను స్పష్టంగా తెలియజేసింది.
మొత్తం మీద కలెక్షన్లు టాక్‌ను మించి రావడం విశేషం. నాలుగో రోజు కూడా ఇంత స్థిరంగా నిలవడం, సోమవారం నుంచి ట్రెండ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న ఆసక్తి పెంచుతోంది.
దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. స్టార్ హీరోల కాంబినేషన్, భారీ యాక్షన్ సీన్స్ సినిమాకు బలంగా పనిచేస్తున్నాయి.