కిరీటి హీరోగా పరిచయం అవుతోన్న సినిమా ‘జూనియర్’ త్వరలో విడుదల కాబోతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండటం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది.
ఈ సినిమాపై ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా, ఆయన బాణీలు బాగా నచ్చుతున్నాయి. సినిమా పట్ల క్రేజ్ పెరగడంతో ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్‌ను పెంచింది.
ఇక ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఆమె జూనియర్ సినిమా కోసం రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తక్కువ టైమ్‌లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీలకు ఇది సాధారణ విషయమేనని అంటున్నారు. వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ ఉన్న ఆమెకు మంచి మార్కెట్ ఏర్పడింది.
ఈ సినిమాలో జెనీలియా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు పాపులర్ హీరోయిన్లు ఉండటం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి.