
న్యూస్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ జరపడం చిత్రసీమలో సంచలనం రేపింది. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో ఆయనను మూడు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
2017–19 మధ్య యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని సంస్థ యజమానులు అక్రమంగా వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ కేసు నమోదు చేయగా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.
దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సంస్థలతో అల్లు అరవింద్‌కు సంబంధించిన సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి రావడంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఈడీ కార్యాలయానికి హాజరై వివరాలు సమర్పించినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులపై ఈడీ ఆరా తీసింది. విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, మరోసారి హాజరు కావాలని అల్లు అరవింద్‌కు సూచించినట్లు సమాచారం.
ఈ కేసులో రామకృష్ణ గ్రూప్ యజమానులతో అల్లు అరవింద్ సంబంధాలపై సైతం ఈడీ దృష్టి సారించింది.