
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘కుబేర’ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ధనుష్ హీరోగా నటించగా, నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో హైలైట్.
ఇప్పటి వరకు చిన్న రేంజ్ సినిమాలు చేసిన కమ్ముల ఈసారి మాత్రం ₹150 కోట్ల బడ్జెట్తో భారీగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే డిజిటల్ హక్కులు రూ.47 కోట్లు రాబట్టగా, థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ.65 కోట్ల వరకు జరిగిందని సమాచారం.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే లొకల్ షేర్ పరంగా సినిమా కనీసం రూ.65 కోట్ల మేర వసూలు చేయాలి. దానికి కావాల్సిన గ్రాస్ రూ.120 కోట్లు దాటాల్సి ఉంది. అంటే సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఫెయిర్ బజ్ ఉంది. నాగార్జున పాపులారిటీ, రష్మిక క్రేజ్ కలిసి ఓపెనింగ్స్ పక్కా అనిపిస్తున్నాయి. టాక్ కలిసి వస్తే లాంగ్ రన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
kubera boxoffice, shekar kammula movie, dhanush nagarjuna film, kubera theatrical business, telugu cinema trade,