
భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త యుగానికి శ్రీకారం చుడుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన తరుణంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడటం విశేషం. టీమిండియా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ, గిల్‌పై భవిష్యత్తు బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. “ఇది భారత క్రికెట్‌లో కొత్త శకానికి మొదలు. గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు తమ సత్తా చూపించాల్సిన సమయం ఇది” అన్నారు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఓ సవాలే అయినా, భారత ఆటగాళ్ల ప్రతిభపై తనకు నమ్మకముందని డివిలియర్స్ అన్నారు. “ఈ యువ బృందం సంకల్పంతో ఆడితే విజయాన్ని సాధించగలదు” అన్నారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై స్పందించిన డివిలియర్స్, అతడు తన బాధ్యతను నిర్వర్తించాడని, కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్‌ను అభిమానులు మిస్సవుతారన్నారు.
డివిలియర్స్ ఐపీఎల్ పాత్రను కూడా కొనియాడుతూ, యువ క్రికెటర్లకు ఇది గొప్ప వేదికగా మారిందని అభిప్రాయపడ్డారు.