
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మాగ్నమ్ ఓపస్ ‘హరిహర వీరమల్లు’కి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ఎట్టకేలకు స్టార్ట్ కానున్నాయి. మే 28న కీరవాణి స్వరపరిచిన “తారా తారా” లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించింది.
ఈ పాట ఎనర్జీ, డ్యాన్స్ వైబ్ కలగలసిన మాస్ బీట్‌గా ఉండబోతుందని ఆమె తెలిపింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మే 27 నుంచి అధికారికంగా శ్రీకారం చుట్టనుంది.
జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ పాట ప్రొమోనే సినిమాపై హైప్ పెంచేలా ఉంది. క్రిష్ జాగర్లమూడి కూడా పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.