fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsబిజినెస్ బ్లాక్‌బస్టర్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి!

బిజినెస్ బ్లాక్‌బస్టర్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి!

arjun-son-of-vijayanti-theatrical-business-details

బిజినెస్ బ్లాక్‌బస్టర్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి!

నందమూరి కళ్యాణ్ రామ్ మాస్ మూడ్‌లోకి వస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ పరంగా సినిమా హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రా హక్కులు రూ.12 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ.3.7 కోట్లకు అమ్ముడయ్యాయి. తాజా అప్డేట్ ప్రకారం, నైజాం రైట్స్‌ను మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేయడం సినిమాకు మరింత బలాన్నిచ్చింది.

ఏప్రిల్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్న వార్తలు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. దీంతో సినిమాపై మరింత ఫోకస్ పెరిగేలా ఉంది.

సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, సోహెల్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 18న విడుదలయ్యే ఈ చిత్రం, మాస్ ఆడియెన్స్‌కు ఒక సాలిడ్ ట్రీట్ అవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular