
పాన్ ఇండియా లెవెల్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోషన్స్ కోసం చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేసి పనిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కింగ్డమ్ ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్‌లో విజయ్‌కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
సందీప్ వంగా-విజయ్ దేవరకొండ స్పెషల్ ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్, సందీప్ కాంబినేషన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్స్‌కు మంచి బూస్టప్ అవుతుందని అంటున్నారు.
ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కింగ్డమ్ కోసం సంగీతాన్ని అనిరుధ్ అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.
ఈ చిత్రానికి కథ, టేకింగ్ రెండు కొత్తగా ఉండబోతున్నాయని అంచనాలు పెరిగాయి. సినిమా జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో సందీప్ వంగా జాయిన్ అవుతుండటంతో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.