
టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ స్టార్ ఎవరు అని అడిగితే చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన వెంకీ మామ, తనదైన కామెడీ టచ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశారు.
ఇప్పుడు వెంకీ మామ నెక్స్ట్ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే… ఆయన, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఒక ఎవర్గ్రీన్ కాంబో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని టాక్. ఇదే ఏడాది సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన తరహాలో… త్రివిక్రమ్ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల కానుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రాలు. ఇప్పుడు పూర్తిగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
వెంకీ మామ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మిళితమైతే… రాబోయే సంక్రాంతికి మరొక హిట్ ఫిక్స్ అనే చెప్పాలి.