
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా రాశి ఖన్నా కూడా కథానాయికగా పాల్గొంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో రాశి ఖన్నా ఫోటోగ్రాఫర్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సినిమాలో ఆమె శ్లోక అనే పాత్రలో కనిపించనుంది. ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా రాశి పాత్ర ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని టాక్. ఈ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్‌తో పాటు రాశి ఖన్నా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతుండగా, షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రాశి ఖన్నా పాత్ర కొత్తగా ఉంటుందన్న ఆసక్తి పెరిగింది.