Tuesday, March 10, 2026
HomeBig StoryIND vs SA: చరిత్రలో తొలిసారి: సొంతగడ్డపై భారత్‌కు 'క్లీన్ స్వీప్' షాక్!

IND vs SA: చరిత్రలో తొలిసారి: సొంతగడ్డపై భారత్‌కు ‘క్లీన్ స్వీప్’ షాక్!

team-india-suffers-first-ever-home-test-series-whitewash-south-africa

IND vs SA: చరిత్రలో తొలిసారి: సొంతగడ్డపై భారత్‌కు ‘క్లీన్ స్వీప్’ షాక్!

న్యూస్ డెస్క్: భారత్ సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓడింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన భారత్ కేవలం 140 పరుగులకే కుప్పకూలింది.

సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై టీమిండియాకు ఇలా ‘క్లీన్ స్వీప్’ అవమానం దక్కడం ఇదే తొలిసారి.

భారత బ్యాట్స్‌మెన్‌లలో రవీంద్ర జడేజా (54) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (13) కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2, ముత్తుసామి మార్కో యాన్సెన్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

సిరీస్‌లో భారత్ ప్రదర్శనపై నిరాశ వ్యక్తమవుతోంది. ప్రపంచంలో బలమైన జట్టుగా ఉన్న టీమిండియా, సొంతగడ్డపైనే ఇంతటి పేలవ ప్రదర్శన ఇవ్వడం అభిమానులను నిరాశపరిచింది.

ఈ సిరీస్ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత వెనుకబడింది. జట్టు త్వరగా ఈ ఓటమి నుంచి కోలుకుని పుంజుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular