
న్యూస్ డెస్క్: ఇంగ్లాండ్‌తో లార్డ్స్ టెస్టులో మహమ్మద్ సిరాజ్ రెండు కీలక వికెట్లు తీసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. వికెట్ తీసిన వెంటనే అతడి హావభావాలు అందరినీ ఆకర్షించాయి.
ఆ స్పందనకు కారణం ఉందని సిరాజ్ తాజాగా ఒక వీడియోలో వివరించాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిసిన తర్వాత తాను షాక్‌కు గురయ్యానని తెలిపాడు.
సిరాజ్ మాట్లాడుతూ “జీవితం ఊహలకు అందదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రేపు ఉండాలన్న గ్యారెంటీ లేదు” అని చెప్పాడు.
తన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తూ, లార్డ్స్‌లో తీసిన వికెట్లను జోటాకు అంకితమిచ్చినట్టు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
పోర్చుగల్ జట్టు అభిమానిగా, జోటా మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పాడు. ఆటతో పాటు మానవత్వాన్ని గుర్తు చేసిన ఈ జెస్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సిరాజ్ చేసిన ఈ భావోద్వేగ స్పందన క్రీడాభిమానుల గుండెల్ని తాకింది.