
కర్ణాటక: ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఉంటుందంటూ జరుగుతున్న ఊహాగానాలకు సిద్ధరామయ్య స్వయంగా తెరదించారు. “ఐదేళ్లపాటు నేనే ముఖ్యమంత్రిని” అని బుధవారం మీడియాతో స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన నాయకత్వ మార్పు జోరుకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. “ఈ విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు” అని సిద్ధరామయ్య స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. “మా పార్టీలో మార్పుల గురించి వాళ్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు?” అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఇదే విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ సిద్ధరామయ్యకు తన పూర్తి మద్దతు ఉన్నట్లు ప్రకటించారు. “అధిష్ఠానం చెప్పిందే చేయడం నా బాధ్యత” అన్నారు.
ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో సీఎం మార్పు చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇక్బాల్ హుస్సేన్, రాజన్న వ్యాఖ్యలు ఊహాగానాలకు ఊపునిచ్చాయి.
ఇక సిద్ధరామయ్య స్పష్టతతో రాష్ట్ర కాంగ్రెస్ నేతృత్వంపై స్పష్టత వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
