
సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో టాలీవుడ్‌లో అసలు ఊగిసలాటే నడుస్తోంది. తాజాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘ఘాటి‘ సినిమాను మళ్లీ వాయిదా వేశారు. ఈసారి సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
అయితే ఇదే తేదీన ఇప్పటికే మిగతా సినిమాలు కూడా బరిలోకి దిగాయి. తేజా సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇందులో మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది.
ఇంకా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాకు కూడా అదే టార్గెట్ డేట్. రష్మిక ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో కనిపించనున్న ఈ మూవీకి మంచి బజ్ ఉంది.
అంతేకాకుండా శివ కార్తికేయన్ నటించిన తమిళ సినిమా ‘మదరాసీ’ కూడా అదే రోజున తెలుగులో డబ్బింగ్ రూపంలో రిలీజ్ కానుంది. ఇలా సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద హీట్ పెరిగేలా కనిపిస్తోంది.