న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ టెస్ట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. జమైకా సబీనా పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కొత్త రికార్డు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో 34 పరుగులకే మూడు కీలక వికెట్లు తీసిన బోలాండ్ తన బౌలింగ్ సగటును 17.33కి నిలిపాడు. కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో 1915 తర్వాత ఇదే అత్యుత్తమ టెస్ట్ సగటుగా ఐసీసీ ప్రకటించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకే ఆలౌట్ అయినా, బౌలర్ల విజృంభణతో విండీస్‌ను కేవలం 143 పరుగులకు పరిమితం చేసింది. ఇందులో బోలాండ్ కీలక పాత్ర పోషించాడు.
జాన్ క్యాంప్‌బెల్, హోప్, షమర్ జోసెఫ్ వికెట్లు బోలాండ్ ఖాతాలో పడ్డాయి. మొత్తం 59 టెస్ట్ వికెట్లు తీసిన బోలాండ్, 17.33 సగటుతో చరిత్రలో నిలిచాడు.
1915 తర్వాత అతని కంటే మెరుగైన బౌలింగ్ సగటును కలిగి ఉన్నవాడు కేవలం ఇంగ్లండ్ బౌలర్ సిడ్ బార్న్స్ (16.43).
ఇది స్కాట్ కెరీర్‌కు గొప్ప మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ టెస్ట్ బౌలర్లలో ఆయన ఒకడిగా నిలిచాడు.