తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు మించిన ఓ ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ పై పెద్ద ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నట్లే, ఇప్పుడు రేవంత్ కూడా తన పేరిట చరిత్ర లిఖించాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఫ్యూచర్ సిటీ కోసం అత్యాధునిక సౌకర్యాలు, మెట్రో, హైస్పీడ్ రైలు, గ్రీన్ కారిడార్ వంటి అనుసంధానాలు ఉండబోతున్నాయి. ఈ నగరాన్ని ఏపీ రాజధాని అమరావతితోనూ లింక్ చేయాలన్నది సీఎం ఆలోచన. కేంద్రం సహకారం కోసం ఢిల్లీకి తరచూ వెళ్లి మంత్రులను కలుస్తున్న రేవంత్.. తన ప్రాజెక్టును వివరించడంలో తెగ వున్నారు.
భవిష్యత్తులో పట్టణ అవసరాలు, మధ్యతరగతి, విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారు. హైబ్రిడ్ నగరంగా, పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీశైలం-నాగార్జునసాగర్ మార్గంలో 30,000 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.
ఈ ప్రాజెక్టు కేంద్రం మద్దతుతో ముందుకు సాగనుంది. అంతా కుదిరితే తెలంగాణ అభివృద్ధిలో రేవంత్ పేరు చెరగని ముద్రగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.