
‘మహారాజ్’ సినిమాతో విజయ్ సేతుపతి భారీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంకు దర్శకత్వం వహించిన నిథిలన్ స్వామినాథన్ టాలెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇప్పుడీ దర్శకుడిపై సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. నిథిలన్ ఇటీవల రజినీని వ్యక్తిగతంగా కలిసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశంలో ఓ మాస్ కథను వినిపించిన డైరెక్టర్‌కు రజినీ కూడా పాజిటివ్‌గా స్పందించినట్టు తెలుస్తోంది. కథపై ఆసక్తిగా ఉన్న రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఇద్దరి కలయిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. మహారాజ్ తరహా లోతైన కథతో రజినీ ఇమేజ్‌ను మిళితం చేస్తే, మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అంతా నమ్ముతున్నారు.
అయితే ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ రావచ్చని భావిస్తున్నారు.
రజినీ తాజా సినిమాల తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.