
రాజా సాబ్ విషయంలో ఇంకా ఎంతకాలం ఈ మౌనం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా విషయంలో మేకర్స్ మౌనం పాటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
మొదట 2024 డిసెంబర్ రిలీజ్ అనుకుంటే, తర్వాత 2025 ఏప్రిల్ 10, ఆపై దసరా, దీపావళి, చివరికి సంక్రాంతి 2026 టార్గెట్ అంటూ రకరకాల టాక్ వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ మేకర్స్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.
ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు నాలుగు పాటలు షూట్ చేయాల్సి ఉందని టాక్. ఇదే సమయంలో పీపుల్స్ మీడియా నిర్మాణంలో ఉండే మరో సినిమా మిరాయ్ పూర్తవుతోంది. ఇక రాజా సాబ్ విషయంలో ఆలస్యం ఎందుకు అన్నది ప్రశ్న.
ఈ ఆలస్యం వల్ల మూవీపై బజ్ తగ్గిపోతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఒక్క అప్డేట్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.