
పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల తర్వాత ఇప్పుడు తాను రూపొందిస్తున్న ‘బెగ్గర్’ అనే చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని హీరోగా తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటివరకు పూరి చేసిన సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని, కథలో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్న విజయ్ సేతుపతి పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ పరంగా ఇది పూరి స్టైల్‌కే కాకుండా, కొత్త తరహాలో ఉంటుందన్న ప్రచారం కొనసాగుతోంది.
ఇదివరకే వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’కు ఆశించిన స్పందన రాకపోవడం పూరికి కొంత నిరాశ కలిగించినా, ఈ కొత్త కథతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కథను చాలా డీప్‌గా తయారు చేశారట.
విజయ్ సేతుపతితో కలిసి పూరి చేయబోయే ప్రయోగం తెలుగు పరిశ్రమలోనే కాదు, దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా పూరికి కొత్త ఛాప్టర్‌గా మారుతుందా..? విజయ్ సేతుపతికి తెలుగు మార్కెట్‌ను మెరిపిస్తుందా అనేది చూడాలి.
puri jagannadh beggar, vijay sethupathi new movie, puri vijay sethupathi combo, beggar movie update, puri jagannadh comeback film,