
న్యూస్ డెస్క్: టీమిండియా ఆసియా కప్ గెలిచి రూ.21 కోట్ల రివార్డ్ పొందగా, పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ గత అనుభవాన్ని బయట పెట్టి సంచలనం సృష్టించాడు.
2009 టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై గెలిచిన తర్వాత, అప్పటి పీఎం యూసుఫ్ రజా గిలానీ ఒక్కో ఆటగాడికి రూ.25 లక్షల చెక్కులు ఇచ్చారని చెప్పారు. కానీ బ్యాంకుకు వెళ్ళగానే అవి బౌన్స్ అయ్యాయని, ఆటగాళ్లకు డబ్బు అందలేదని వెల్లడించాడు.
ఆ సమయంలో ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప వేరే డబ్బు అందలేదని అజ్మల్ అన్నారు. ప్రభుత్వమే ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడం తమకు షాక్ ఇచ్చిందని చెప్పారు.
ఈ సమస్యను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
ఇక, టీమిండియా ఇప్పటి వరకు 9 సార్లు ఆసియా కప్ గెలిచింది. పాకిస్థాన్ మాత్రం 2 సార్లకే పరిమితమైంది.
భారత్ పాక్ ఆసియా కప్ పోటీలలో టీమిండియా 13 విజయాలు సాధించగా, పాకిస్థాన్ కేవలం 6 విజయాలు మాత్రమే సాధించింది.
