మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వార్-2 చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్న తారక్, తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాను 2025లో విడుదల చేయనున్నాడు.
ఈ రెండు ప్రాజెక్టులు రిలీజ్ కాకముందే తారక్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించనున్న చిత్రంపై మేకర్స్ ప్లానింగ్ మొదలుపెట్టారు.
ఈ సినిమా నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి కథాంశం ఆధారంగా ఉంటుందని హింట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ, కథను భిన్నంగా మలచుతున్నట్లు తెలిపారు.
ఇక ఇందులో విలన్ పాత్ర కోసం మేకర్స్ బిగ్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటిని తారక్‌కు విరుద్ధంగా తీసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయట.
రానా పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. తారక్ vs రానా పోరాటం తెరపై చూస్తే మాస్ ఆడియెన్స్‌కు పండగే.
ఈ క్రేజీ కాంబోకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ntr trivikram movie, rana villain role, tollywood updates, sithara entertainments, telugu cinema news