
న్యూస్ డెస్క్: ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలికి గాయం కావడంతో సిరీస్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని సమాచారం. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో గాయం వాటిల్లినట్టు తెలుస్తోంది.
స్కాన్‌ల ప్రకారం నితీశ్‌కు లిగమెంట్ సమస్య ఉన్నట్లు తేలింది. అతడు మాంచెస్టర్ వెళ్లినా ఆదివారం ప్రాక్టీస్‌కి హాజరు కాలేదు.
ఇక ఇప్పటికే అరుణ్‌దీప్ సింగ్ గాయం కారణంగా జట్టుకు దూరమవగా, ఇప్పుడు నితీశ్ కూడా జాబితా నుంచి ఔట్ కావడం టీమిండియాకు మరింత ఇబ్బంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న భారత్, నాలుగో టెస్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.
నితీశ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతడిని గత మ్యాచ్‌లో నితీశ్ స్థానం కోసం తప్పించారు. ఇప్పుడు అదే అవకాశం అతడిని మళ్లీ గెలిపించొచ్చన్న ఆశలు ఉన్నాయి.
ఈ గాయాల దెబ్బతో ఇండియా జట్టులో బ్యాలెన్స్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కాంబినేషన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ కాస్త టెన్షన్‌కి లోనవుతోంది.
నాలుగో టెస్టు జూలై 23న మాంచెస్టర్‌లో జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.