fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsనాని-సుజీత్ మాస్ ప్లాన్.. నవంబర్ నుంచి బ్లడీ రోమియో!

నాని-సుజీత్ మాస్ ప్లాన్.. నవంబర్ నుంచి బ్లడీ రోమియో!

nani-sujeeth-bloody-romeo-movie-starts-in-november

నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ హిట్‌లతో దూసుకెళ్తున్న నాని, ఇప్పుడు మరో మాస్ యాంగిల్‌కి రెడీ అవుతున్నాడు.

సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘OG’కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక, నాని సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ పనులు దసరా తర్వాత మొదలుకానున్నాయి. నవంబర్ 2025 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఈ ప్రాజెక్ట్ తొలుత DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాలని భావించినా, బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. కానీ కథ నానికి ఎంతో నచ్చడంతో, కొత్త నిర్మాణ సంస్థతో సినిమాను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

2026లో థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాకు మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉండనుందని సమాచారం. సుజీత్ స్టైల్‌లో నానిని పూర్తిగా డిఫరెంట్ యాంగిల్‌లో చూపించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular