
న్యూస్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం వల్ల చిన్న చిన్న క్షణాలను కూడా ఫోటోలో బంధిస్తున్నారు. కానీ, నిపుణుల ప్రకారం గ్యాలరీలో కొన్ని ఫోటోలు సేవ్ చేసుకోవడం భవిష్యత్తులో ప్రమాదం కలిగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మనలో చాలామంది ప్రైవేట్ ఫోటోలు మాత్రమే కాదు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి సున్నితమైన డాక్యుమెంట్‌ల ఫోటోలు కూడా మొబైల్ గ్యాలరీలో ఉంచుతున్నారు.
కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్ చేసే సమయంలో గ్యాలరీ యాక్సెస్ అడుగుతాయి. అలా మన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు రక్షిత్ టాండన్ సూచనల ప్రకారం, అలాంటి ఫోటోలను గ్యాలరీలో కాకుండా డిజీ లాకర్ వంటి భద్రతా యాప్‌లలో ఉంచడం మంచిదని చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లు బలంగా ఉండాలి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోవాలి.
అలాగే అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేయకపోవడమే సేఫ్. గ్యాలరీలో ఏ ఫోటో ఉంచాలో, ఏది వద్దో తెలుసుకోవడం సైబర్ సేఫ్టీకి కీలకం.
