Saturday, June 13, 2026
HomeTelanganaవర్షాల కారణంగా ఎంజీబీఎస్ మూత.. కీలక సూచనలు

వర్షాల కారణంగా ఎంజీబీఎస్ మూత.. కీలక సూచనలు

న్యూస్ డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మూసీ నది ఉప్పొంగింది. దాంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంపై స్పందించారు. ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు రావొద్దని స్పష్టంగా సూచించారు.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్‌ నుంచి బయలుదేరుతున్నాయి.

సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లేవి ఎల్బీనగర్‌ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు సర్వీసులు ఆరాంఘర్‌ నుంచి నడుస్తున్నాయి.

ఎవరైనా పొరపాటున ఎంజీబీఎస్‌కు వస్తే, వారికి లోకల్ బస్సులు ఏర్పాటు చేసి సంబంధిత బోర్డింగ్ పాయింట్లకు తరలిస్తామని సజ్జనార్ చెప్పారు.

వర్షాలు, వరదలు తగ్గే వరకు ఎంజీబీఎస్ మూసే ఉంటుందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular