
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆఫీసులో ట్రంప్ తనను అనుచితంగా చూశారని నటి మారియా ఫార్మర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎప్‌స్టీన్ సంస్థలో పని చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో, రాత్రి సమయంలో తనను ఆఫీసుకు రావాలని ట్రంప్ ఫోన్ చేశారని చెప్పింది.
నైట్ డ్రెస్‌లో అక్కడికి వెళ్లినప్పుడు ట్రంప్ తన శరీరాన్ని విచిత్రంగా చూశారని, ప్రత్యేకంగా కాళ్లవైపు చూస్తూ ఉండిపోయాడని మారియా వివరించారు. ఇది 1995లో జరిగిన సంఘటన అని, అప్పటికి తన వయస్సు 20 ఏళ్లు మాత్రమేనని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఎప్‌స్టీన్ వచ్చి “ఆమె నీకోసం కాదు” అని ట్రంప్‌కు చెప్పాడని గుర్తు చేశారు.
ఎప్‌స్టీన్ కుంభకోణం కేసులో మారియా ఫార్మర్ గతంలోనే ఘాటు ఆరోపణలు చేశారు. తాజాగా ట్రంప్‌పై ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మారియా ఆరోపణలపై వైట్ హౌస్ స్పందిస్తూ, ట్రంప్ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు నెమ్మదిగా తెంచుకున్నారని తెలిపింది.
అలానే, ట్రంప్ ఎప్‌స్టీన్ ఆఫీస్‌కు వెళ్లలేదని, ఈ ఆరోపణల్లో నిజం లేదని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ పేర్కొన్నారు.