Tuesday, January 20, 2026
HomeInternationalకరోనా కంటే భయంకరం.. మార్బర్గ్ వైరస్‌పై WHO హెచ్చరికలు

కరోనా కంటే భయంకరం.. మార్బర్గ్ వైరస్‌పై WHO హెచ్చరికలు

marburg-virus-who-alert-symptoms-preventive-measures-ethiopia-outbreak

న్యూస్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా మార్బర్గ్ వైరస్ గురించి చేసిన హెచ్చరిక ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. దక్షిణ ఇథియోపియాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ డిసెంబర్ 3 నాటికి ఏకంగా 8 మంది మరణానికి కారణమైంది. మరో 13 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

మరణాల రేటు:

ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 88 శాతం ఉంటుందని అధికారులు తేల్చేశారు. ఈ వైరస్ ఎక్కువగా దక్షిణ ఇథియోపియా సిడానా ప్రాంతాలలో గుర్తించబడింది. దీని వ్యాప్తి కారణంగా ఆ ప్రాంతంలో ఆరోగ్య పర్యవేక్షణ ప్రజా భద్రతా చర్యలు పెరుగుతున్నాయి.

ప్రధాన లక్షణాలు:

మార్బర్గ్ వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు:

  • తీవ్రమైన కండరాల నొప్పి
  • అధిక జ్వరం
  • తలనొప్పి, అలసట
  • కొంతమందిలో అతిసారం, వాంతులు, ఛాతీ నొప్పి

వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఒక్కొక్కసారి రక్తస్రావం జరిగి అనేక అవయవాలు పనిచేయడం ఆగిపోతాయట. ఈ వైరస్ సోకిన వ్యక్తి దాదాపు 8 నుండి 9 రోజుల్లో మరణిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాప్తి నివారణ:

ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు సోకి వారి ఉండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ఎబోలా కుటుంబానికి చెందినది. వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా వచ్చే రక్తం, మూత్రం, లాలాజలం, ఇతర శారీరక ద్రవాలు నేరుగా నేలపై పడడం ద్వారా ఇది వ్యాపిస్తుంది.

ఈ వైరస్‌కి మెడిసిన్ గానీ సరైన చికిత్స గానీ, టీకా గానీ అందుబాటులో లేకపోవడం వల్ల మరణాల సంఖ్యను అంచనా వేయలేమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చరిత్ర జాగ్రత్తలు:

మార్బర్గ్ వైరస్ ఇప్పుడు కాదు, 1967 లోనే జర్మనీలోని మార్బర్గ్ నగరంలో ప్రయోగశాలలో గుర్తించారు. గతంలో ఈ వైరస్ టాంజానియా, కాంగో, ఉగాండా, అంగోలా, కెన్యా, ఆఫ్రికా, ఘనా వంటి దేశాల్లో వ్యాప్తి చెందింది. వైరస్ సంకేతాలు ఉన్న ఎవరైనా వెంటనే వైద్య సహాయం పొందాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular