
SRHకు మరో భారీ ఓటమి… KKR విజయం అట్టహాసం!
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్కతా నైట్ రైడర్స్ మరో గ్రాండ్ విక్టరీను నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 80 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది.
కోల్కతా బౌలర్ల దాడికి హైదరాబాద్ ఓవైపు నిలబడలేకపోయింది. క్లాసెన్ (33) మాత్రమే కొంత కుదురుగా ఆడగా, మెండిస్ (27), నితీశ్ రెడ్డి (19) తప్ప మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను కట్టడి చేశారు. రస్సెల్ రెండు, నరైన్, హర్షిత్ రాణా తలా ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి నుంచి దూకుడు చూపింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేయగా, రఘువంశీ 50 పరుగులు చేశాడు. రహానే 38, రింకు సింగ్ 32 పరుగులతో మద్దతిచ్చారు.
ఐతే హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. తొలి మూడు ఓవర్లలోనే హెడ్, అభిషేక్, ఇషాన్ ఔట్ కావడంతో 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దెబ్బ నుంచి SRH తిరగలేకపోయింది.
క్లాసెన్, కమిన్స్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన SRH చివరకు 16.4 ఓవర్లకే ఆల్‌ఔట్ అయింది. వరుణ్ చక్రవర్తి ఓవర్లో రెండు వికెట్లు తీయగా, చివరి వికెట్‌ను రస్సెల్ తీశాడు.
ఈ గెలుపుతో కోల్‌కతా పాయింట్స్ టేబుల్‌లో మరింత మెరుగైన స్థానం దక్కించుకుంది. మరోవైపు SRHకు ఇది మరో షాకే అయిన సంగతి స్పష్టమవుతోంది.