Wednesday, July 23, 2025
HomeMovie Newsకన్నప్ప ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

కన్నప్ప ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

kanappa-ott-release-date-update

టాలీవుడ్‌లో ఇటీవల విజయవంతంగా రన్‌ అయిన డివోషనల్ డ్రామా “కన్నప్ప” ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. క్లైమాక్స్ సీన్స్‌లో విష్ణు మంచి నటన చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి పెరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం జూలై 25 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే విడుదల చేయడానికి ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తోంది. అయితే, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా అధికారిక అప్డేట్ రావచ్చని టాక్.

ఈ నేపథ్యంలో అభిమానులు కన్నప్ప స్ట్రీమింగ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular