
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో చేసిన తొలి అడుగు వార్ 2 భారీ హైప్‌తో రిలీజ్ అయి, 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో తారక్ యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లోకి అధికారికంగా అడుగుపెట్టాడు. మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అయినప్పటికీ, తారక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన వచ్చింది.
అయితే, వార్ 2 తర్వాత తారక్ బాలీవుడ్‌లో సోలో సినిమా చేయనున్నాడని గతంలో బలమైన టాక్ వచ్చింది. హిందీ మేకర్స్ కూడా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారని తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం వార్ 2 ఫలితమేనని బీటౌన్ టాక్. సినిమా వసూళ్లు డీసెంట్‌గా ఉన్నా, క్రిటిక్స్ రివ్యూలు మిక్స్‌గా రావడంతో, మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తారక్ ఇమేజ్, మార్కెట్‌ను బాగా అర్థం చేసుకునే వరకు సోలో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
మరింతగా, తారక్ ప్రస్తుతం టాలీవుడ్‌లో డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, సమయ పరిమితులు కూడా సమస్యగా మారాయి. అందుకే హిందీ సినిమా ఇప్పటికి ఫ్రీజ్ అయినట్టే అనిపిస్తోంది.