
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందం, నటనతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆమె పరమ్ సుందరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొని సరదా వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి, పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు జాన్వీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ముగ్గురు పిల్లలు కావాలని ఉందని చెప్పింది. కారణం ఏమిటని అడిగితే మూడు తన లక్కీ నంబర్ అని నవ్వుతూ జవాబిచ్చింది.
ఇద్దరు పిల్లలు ఉంటే గొడవలు ఎక్కువగా ఉంటాయని, ముగ్గురు ఉంటే ఇంట్లో ఎప్పుడూ సందడి ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇది విన్న అభిమానులు జాన్వీ వ్యాఖ్యలపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. నేరుగా ముగ్గురు పిల్లలు కావాలన్న జాన్వీ డ్రీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇక అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిని చెన్నైలోని పూర్వికుల ఇంట్లో జరుపుకోవాలని, వివాహం తర్వాత తిరుమలలో ప్రత్యేకంగా ముహూర్తం పెట్టాలని కూడా చెప్పిన విషయం వైరల్ అవుతోంది.