fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsపవర్ స్టార్ మూవీకి మ్యూజిక్ పండుగ మొదలు

పవర్ స్టార్ మూవీకి మ్యూజిక్ పండుగ మొదలు

harihara-veeramallu-taara-taara-song-release-may28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మాగ్నమ్ ఓపస్ ‘హరిహర వీరమల్లు’కి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ఎట్టకేలకు స్టార్ట్ కానున్నాయి. మే 28న కీరవాణి స్వరపరిచిన “తారా తారా” లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించింది.

ఈ పాట ఎనర్జీ, డ్యాన్స్ వైబ్ కలగలసిన మాస్ బీట్‌గా ఉండబోతుందని ఆమె తెలిపింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మే 27 నుంచి అధికారికంగా శ్రీకారం చుట్టనుంది.

జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ పాట ప్రొమోనే సినిమాపై హైప్ పెంచేలా ఉంది. క్రిష్ జాగర్లమూడి కూడా పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular