
న్యూస్ డెస్క్: మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం లేని సమస్యలకు చెక్ పెడుతూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్టార్ లింక్ సేవలు భారత్‌లో ప్రారంభం కానున్నాయి. ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న ఈ సంస్థ తాజాగా నెలవారీ ధరలను ప్రకటించింది.
స్టార్ లింక్ వెబ్ సైట్ ప్రకారం, రెసిడెన్షియల్ కస్టమర్‌లు నెలకు రూ. 8,600 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా హార్డ్‌వేర్ ధరను రూ. 34 వేలుగా నిర్ణయించింది. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది.
తమ సేవలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా పనిచేస్తాయని స్టార్ లింక్ తెలిపింది. ఈ డివైజ్‌ను ప్లగ్ అండ్ ప్లే విధానంగా రూపొందించారు. వినియోగదారులు సొంతంగా దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఫైబర్ టెలికాం టవర్లు లేని కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకే స్టార్ లింక్ సేవలు పరిమితం కానున్నాయి. నెట్‌వర్క్ తక్కువగా లేదా లేని ప్రాంతాల్లోని రైతులు, అటవీ నివాసులకు ఇది ఉపయోగపడుతుంది. భారీ ధర కారణంగా ఇండియాలో దీని వినియోగం అత్యవసరం అయితే తప్ప ఉండకపోవచ్చు.
నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని వెబ్ సైట్ లో పేర్కొంది. SpaceX హైదరాబాద్, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో గేట్ వే ఎర్త్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.
