Friday, September 4, 2026
HomeBig Storyఅమెరికా చేరిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

అమెరికా చేరిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

CORONA-STRAIN-ENTERS-AMERICA

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో కొత్త కరోనా వైరస్‌ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. యూకే‌లో తొలిగా బయటపడ్డ ఈ కొత్త కరోనా వ్యాప్తి తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు కూడా చేరింది.

కోవిడ్‌తో ఇప్పటికే అతలాకుతలమైన అమెరికాను కొత్త కరోనా వైరస్‌ మరింత భయపెడుతోంది. అమెరికా కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ జేర్డ్‌ పొలిస్‌ ప్రకటించారు. ఈ కొత్త వైరస్‌ బారిన పడిన ఆ వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా ఈ వైరస్ మరింత ఆందోళన కల్గిస్తుంది.

సదరు వ్యక్తికి వైరస్ ఎలా‌ సోకిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇక బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి అమెరికా ఆ దేశం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కరోనా వైరస్ వేరియంట్ ‌కి చాలా వేగంగా వ్యాప్తించే గుణం ఉన్నట్టు బ్రిటన్‌ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్‌ బయటపడినట్టు 19 వ తేదిన ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 15344398636a9b1df372c76